అప్పటికే నాలుగు ట్యాంకర్లు వచ్చేశాయి. అందులో ఉన్న నెయ్యిని వాడారు. తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి చెప్పినా వినలేదు. కాబట్టి ఆయనకు ఉన్న విశేష అధికారం ఉపయోగించి ఎన్ డి డి బి ల్యాబ్ కు శాంపిళ్లు పంపించారు. 2024 జులై 16న శాంపిళ్లు పంపితే 23న రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. నాణ్యత లేదనేది ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంత వరకూ ఎవరూ ఎస్టాబ్లిష్ చేయలేదు. క్వాలిటీ గురించి కార్యనిర్వహణాధికారి చెప్పినా నెయ్యి సరఫరాదారుడు పట్టించుకోలేదు. దాంతో ఎన్ ఏ బి ఎల్ అక్రిడిటేషన్ కోసం నెయ్యి శాంపుళ్లు నాబార్డ్ ల్యాబ్ కు పంపించారు. వాళ్లిచ్చిన షాకింగ్ రిపోర్టు ఇది.