ట్రిపుల్ ఆర్ తరువాత, ఎన్టీఆర్ “దేవర” సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి **”వార్ 2″**లో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది.
ఆగస్టు 15కి రాబోతున్న “వార్ 2”
ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్టు 15, 2025న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ ఈ సినిమాలో పూర్తిస్థాయి విలన్ రోల్ చేస్తాడన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ పూర్తిగా విలన్‌గా కాకుండా, డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.
ఎన్టీఆర్ పాత్ర స్పెషల్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్‌లో దేశం కోసం ప్రాణాలను కూడా అర్పించేందుకు సిద్ధమైన సైనికుడిగా కనిపించబోతున్నాడు. దేశభక్తి, పవర్‌ఫుల్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర, ఆకస్మాత్తుగా ఎలా దేశానికి విరోధిగా మారింది? ఈ ఎమోషనల్ స్టోరీని అయాన్ ముఖర్జీ అద్భుతంగా చూపించబోతున్నారని సమాచారం. అంతేకాదు, ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు.
హృతిక్-ఎన్టీఆర్ మధ్య గ్లోబల్ రేంజ్ యాక్షన్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా హైలైట్‌గా నిలుస్తాయని టాక్. వీరి మధ్య పోరాట సన్నివేశాలు గూస్‌బంప్స్ రప్పించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక షారుఖ్ ఖాన్ కూడా పఠాన్‌గా ఓ కీలక సన్నివేశంలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది చూడాలి.
టీజర్ అప్‌డేట్
ఈ సినిమా టీజర్‌ను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ భవిష్యత్ ప్రాజెక్టులు
“వార్ 2” తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఆ తరువాత జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో ఒక చిత్రం, అలాగే దేవర 2 ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
ఎన్టీఆర్ “వార్ 2”తో అభిమానులకు కొత్త అనుభూతిని అందించబోతున్నాడు. డ్యూయల్ షేడ్స్, పవర్‌ఫుల్ యాక్షన్‌తో ఆయన రోల్ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.