ఢిల్లీలో అతిశీకి కోర్టులో ఊరట: బీజేపీ పరువు నష్టం పిటిషన్ కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, బీజేపీపై చేసిన విమర్శలకు సంబంధించి పరువు నష్టం పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. గతలో, లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీపై ఆమె చేసిన విమర్శలు, బెదిరింపులు చర్చనీయాంశమయ్యాయి.

బీజేపీలో చేరకుంటే, ఈడీ తన పార్టీ నేతలను అరెస్ట్ చేస్తుందని, కాషాయ పార్టీకి చెందిన కొందరు నాయకులు తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, పరువు నష్టం పిటిషన్‌ను కూడా కోర్టులో దాఖలు చేశారు.

ఈ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు తన తీర్పులో, “అతిశీ ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తావించినది పక్షే, మరియు పార్టీతో సంబంధించి చేశారన్నదే నిజం” అని చెప్పింది. దీంతో, కోర్టు బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను కొట్టి వేసింది.

ఈ తీర్పు ఆమెకు ఊరట కలిగించే విషయం, ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ఇది ఆమె రాజకీయంగా మరింత ఆధిక్యతను పెంచే దిశగా ఉంటుంది.

తాజా వార్తలు