నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహించగా, ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందించబడింది. బాలయ్య ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు.

ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచిన వార్త నిర్మాత నాగవంశీ ఇచ్చారు. ఆయన తన సోషల్ మీడియా పేజీలో ‘డాకు మహారాజ్’ సెకండాఫ్ లో ఒక ప్రత్యేక సీక్వెన్స్ ఉంటుందని, అది ‘సమర సింహారెడ్డి’ తరహా ఎపిసోడ్ గా ఉంటుందని ప్రకటించారు. ఇది అభిమానులను తిరిగి పాత రోజులకు తీసుకెళ్లనుంది అని నాగవంశీ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ ద్వారా, సమర సింహారెడ్డి మూవీలోని పవర్‌ఫుల్ డైలాగ్స్, బాలయ్య ఊచకోత తరహా సీక్వెన్స్ ‘డాకు మహారాజ్’ లో కూడా ఉంటుందని అర్థమవుతోంది. దీంతో, ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం థమన్ అందిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.