పుష్ప2 మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి రికార్డులతో కాదు… ఆ రికార్డుల వెనక మతలబు గురించి ఇక సంక్రాంతికి వస్తున్నాం అంటూ దిల్ రాజు వస్తే… వచ్చినదెంతో తెలుసుకోవడానికి ఐటీ అధికారులు వచ్చేశారు.అవునూ ఇండస్ట్రీలో ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి.
టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో పాటు వాటితో వ్యాపార లావాదేవిలున్న కంపెనీలు, వ్యక్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వీరు నిర్మించిన సినిమాల వసూళ్లు .. పోస్టర్స్‌లో భారీగా ఉండటంతో ఆదాయశాఖ దృష్టి సారించింది. కామన్‌గా హీరోల పర్సనల్ టీమ్స్ పీఆర్ టీమ్స్ కలిసి కావాలనే కలెక్షన్ నెంబర్స్ ను భారీగా చూపిస్తూ పోస్టర్లు వేయిస్తుంటారు. అందుకే సదరు సినిమాల నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు జరుతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐటీ అధికారులు కేవలం వీటిపైనే దృష్టి పెట్టలేదని తెలుస్తోంది, అగ్ర నిర్మాణ సంస్దలు వరుస సినిమాలు నిర్మిస్తున్నాయి. వాటికి బడ్జెట్ కేటాయింపుల పరంగా , రెమ్యూనరేషన్ ల విషయంలో తేడాలున్నాయనే సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసలు ఇండస్ట్రీపై ఐటీ దాడులు ఎందుకు జరుగుతుంటాయి. అన్నీ ఓపెన్ గానే పారదర్శకంగానే చేస్తున్నామని చెప్పినా… పదే పదే ఎందుకు సెలబ్రెటీలు టార్గెట్ అవుతున్నారు. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంటుంది.
వ్యాపారమైనా ఇప్పుడు ఎక్కువ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరుగుతోంది. సినిమాల బిజినెస్ కూడా నిర్మాతలు, పంపిణీదారులు మ్యాగ్జిమమ్ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నటప్పటికి..రెమ్యూనరేషన్ ల విషయంలో క్యాష్ చెల్లింపులను కొందరు హీరోలు దర్శకులు కోరుకోవటం.. అది కూడా భారీ అమౌంట్స్ కావటంతో .. అగ్ర నిర్మాణ సంస్దలు వారికోసం డబ్బును వెతుక్కోవాల్సి వస్తొందనే ప్రచారం ఉంది. అందుకోసం ఫైనాన్సియర్స్ నుంచి పెద్దమొత్తంలో డబ్బును తీసుకోవటంతో పాటు ,తిరిగి వడ్డీలనుకూడా క్యాష్ రూపంలో చెల్లించాల్సి రావటం.. .అదంతా కూడా అధికారిక లెక్కలలోకి ఎక్కించలేని పరిస్థితి నెలకొందనే టాక్ నడుస్తొంది .
దాదాపు ప్రతి హీరోకి కొంత మేర క్యాష్ రూపేణా ఇచ్చుకోవాల్సి వస్తుండటం వల్ల నిర్మాతలకు దాన్ని సర్దుబాటు చేయటం భారంగా మారుతోందని. ప్రస్తుతం జరుగుతోన్న ఐటీ సోదాలలో ఈ తరహా క్యాష్ చెల్లింపులపైనే అధికారులు దృష్టి సారించారని..ఈ క్రమంలో ఎవరైనా హీరోల పై కూడా ఐటీ సోదాలు జరుగుతాయా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి… ఇక రెండు అగ్ర నిర్మాణ సంస్దలపై ఐటీ దాడులతో , మరికొందరు నిర్మాతలు హైదరాబాదు ను వదిలేసి వెళ్లిపొయినట్లుగా తెలుస్తొంది. సంక్రాంతికి ఓ హిట్ సినిమాను తీసిన యువ నిర్మాత గత రెండు రోజులుగా అందుబాటులో లేడని… మరికొందరు తమపై కూడా ఎక్కడ ఐటీ నజర్ పడుతుందోనని భయపడుతున్నట్లు తెలుస్తోంది.