అమరావతి: నిజం గెలవాలి కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన నారా భువనేశ్వరి, చేనేత కార్మికుల కష్టాలు గురించి తెలిపారు. మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ వంటి ప్రాంతాలలో చేనేత వస్త్రాలు ప్రసిద్ధి చెందాయని గుర్తుచేశారు.
చేనేత కార్మికులు నూలు సేకరణ నుండి బట్టనేసే దశ వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తమ కుటుంబాల కోసం అతి కష్టం చేస్తూ వస్త్రాలు తయారు చేస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలోని బాధ్యతను గుర్తిస్తూ, పండుగ రోజున చేనేత వస్త్రాలు ధరించాలని, తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని ప్రోత్సహించారు. “చేనేత కార్మికులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మేము అందరం చేనేత వస్త్రాలు ధరించాలని” ఆకాంక్షించారు.