యువనేత నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానంలో తిరుగులేని నాయకుడిగా ఎదగడం గర్వంగా ఉంది. ఆయన నాయకత్వంలో యువత కోసం తీసుకున్న ప్రత్యేక కార్యక్రమాలు, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన సంస్కరణలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి.
ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి, నారా లోకేష్ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంటే ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించడంతోపాటు, వారికి ఆప్త సహాయం అందించడంలో కూడా ముందుంటున్నారు.
విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం చేసి, వారి కోసం ప్రాణదాతగా నిలుస్తున్నారు. పిలిస్తే పలికే ప్రజా నాయకుడిగా లోకేష్ అనతికాలంలోనే ప్రజల మన్ననలు పొందారు.
పార్టీని బలపరిచేందుకు, లోకేష్ సారధ్యంలో జరిగిన సభ్యత్వ నమోదులో టీడీపీ చరిత్ర తిరగరాసింది. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి చేరడంలో లోకేష్ విశేష కృషి చేశారని చెప్పొచ్చు. పార్టీ శ్రేణులను ఆయన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు.
ఐటీ మంత్రిగా రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు సాధించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి, ఆ ప్రక్షాళనను కూడా ఆయన చేపడుతున్నారు.
