సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయం అన్నారు.
ప్రభుత్వం తెలంగాణ యువతకు మంచి ఉన్నత ఉద్యోగాలు అందించే ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయని పేర్కొన్నారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు తీర్పు తో విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోగలరు. 13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. దీనిని మంచిగా ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నాం.”
గ్రూప్ 1 విద్యార్థులకు మేము మొదటి నుంచి అండగా ఉన్నామని, జిఓ 29 వల్ల రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి స్పష్టం చేశారు.
“నేను బిసి బిడ్డగా, విద్యార్థులకు భరోసా ఇస్తున్నాను. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం గ్రూప్ 1 విద్యార్థులను పావుగా వాడుతున్నాయి,” అని చెప్పారు.
పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు, అభినందనలు! మీ భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.