ఒక్క సరైన హిట్ కోసం మ్యాచో స్టార్ గోపీచంద్ చాలా కాలంగా ఎదురు చుస్తున్నాడు .. గతేడాది విడుదలైన ‘భీమా’ చిత్రంతో కొంత ఊరట పొందినా, ఇటీవల వచ్చిన ‘విశ్వం’ సినిమా మరోసారి డిస్సపాయింట్ చేసింది .. అయితే, తాజాగా గోపీచంద్ తన తదుపరి ప్రాజెక్ట్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది ..
జిల్ దర్శకుడితో ప్రాజెక్ట్ ఆగిపోయింది
జిల్ దర్శకుడు రాధాకృష్ణతో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు గోపీచంద్ కెరీర్‌ను మలుపుతిప్పే ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది.
సంకల్ప్ రెడ్డితో కొత్త కాన్సెప్ట్
ఘాజీ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన సంకల్ప్ రెడ్డి గోపీచంద్‌కు ఓ కొత్త కథ వినిపించారు. ఘాజీ తర్వాత అంతరిక్షం మరియు ఐబీ-71 వంటి సినిమాలతో ముందుకు వచ్చినా, ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో సంకల్ప్ గోపీచంద్‌ను సంప్రదించారు, ఇది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నారు. ‘విశ్వం’ తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమా ఇదే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా కథ?
సంకల్ప్ రెడ్డి కథల ప్రత్యేకత, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందడం. కానీ ఈసారి అదే ఫార్మాట్‌లో వెళ్తాడా లేదా కొత్త జానర్ ఎంచుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సంకల్ప్ కెరీర్ తీరును నిర్ణయించే ప్రాజెక్ట్‌గా మారనుంది.
గోపీచంద్‌కి కీలక సమయం
ప్రస్తుతం గోపీచంద్ కథల ఎంపికలో జాగ్రత్త వహించాల్సిన తరుణమిది. భారీదనం, హై లెవెల్ యాక్షన్, వరల్డ్ బిల్డింగ్ వంటి అంశాలను సరిగా వాడుకోవడమే ఈ సినిమాకు విజయవంతం కావడానికి కీలకం అవుతుంది.