బాలయ్య – బాబీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘డాకు మహారాజ్’ .. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , విజుల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది .. అలానె ఈ సినిమా మేకింగ్ విషయంలో బాబీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు , సినిమా విషయంలో బాబీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది ..
ఇక ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా గ్రాండ్ స్కేల్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఓవర్సీస్ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 20 నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.