హైదరాబాద్: గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం (స్టాండింగ్ కమిటీ)లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యుడిగా నియమితులయ్యారు.

గురువారం రాత్రి పార్లమెంటరీ బులిటెన్‌లో రాజ్య సభ నుండి 10 మంది ఎంపీలు, లోక్ సభ నుండి 21 మంది ఎంపీలతో కూడిన ఈ కమిటీని ప్రకటించారు.

కమిటీని ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చైర్మన్‌గా నిర్వహించనున్నారు.

ఈ కమిటీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ పనితీరు పరిశీలనలో కీలక పాత్ర పోషించనుంది.

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ బాధ్యతలను చేపట్టడం ద్వారా రాష్ట్రానికి, ప్రజలకు మరింత సేవ చేయగలరో అనుకుంటున్నారు.