పుష్ప 2 హ్యాంగోవర్ నుంచి బయటపడడానికి అల్లు అర్జున్ ఇంకా కొన్ని రోజులు పట్టేలా ఉంది . భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. పుష్ప 2 చివరి లో పుష్ప పార్ట్ 3 ఉంటోంది అని ప్రకటించారు . అయితే పుష్ప 3 చెయ్యాలంటే కనీసం మరో రెండు ఏళ్ళు పడుతుంది .ఇక సుకుమార్ కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేసాడు . గుంటూరు కారం సినిమా తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా ఎనౌన్స్ చేసాడు .. త్రివిక్రమ్‌తో ముందే ప్రకటించిన సినిమా సెట్స్‌పైకి వెళుతుందా? సడెన్ గా పుష్ప 3 లైన్‌లోకి వస్తుందా?

త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ కుదిరేనా?
పుష్ప 2 సక్సెస్ తర్వాత, బన్నీ ఏం చేసినా అందుకు తగినంత హైప్ ఉండాలి. ఇది సినీప్రియుల అంచనాలు. ఇంతకుముందే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్, ఇప్పుడా ప్రాజెక్ట్‌పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది .. గుంటూరు కారం విడుదలకు ముందే బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈసారి పక్కా పాన్ ఇండియన్ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్‌ మీద ఎక్కువగా పనిచేస్తున్నారు. పీరియాడ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, మైథాలజీ టచ్‌ ఉన్న ఈ కథ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట.త్రివిక్రమ్ ముందు అట్లీ పేరు బన్నీ దర్శకుల లిస్టులో బలంగా వినిపించింది. పుష్ప 2 రిలీజ్ తర్వాత అట్లీ ఒక ట్వీట్ కూడా చేయడం చర్చనీయాంశమైంది

పుష్ప 3కు ఇంకా టైమ్ ఉంది
పుష్ప 3 అనౌన్స్‌మెంట్ రావొచ్చని భావించినా, ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ ప్రకటించడంతో, పుష్ప 3 కొంతకాలం వెనుకబడే అవకాశం ఉంది. అందువల్ల, బన్నీ త్రివిక్రమ్ సినిమానే మొదటిసారి సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది.

మేకోవర్‌తో బన్నీ రీడీ
అల్లు అర్జున్ ప్రస్తుతం తన గడ్డంతో కనిపిస్తూనే ఉన్నాడు. కానీ త్రివిక్రమ్ కోసం ఆయన పూర్తి మేకోవర్ కానున్నాడట. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను 2025 జూన్ తర్వాత సెట్స్‌పైకి తీసుకురాబోతోంది. సంక్రాంతి 2024 తర్వాత ఒక స్పెషల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.