హైదరాబాద్: గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆతిహితులుగా ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి అధ్యక్షత వహించారు.
సమావేశంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నాయకులు, 23 మంది సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం ప్రారంభం లో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతికి సంబంధించి శ్రద్ధాంజలి అర్పించేందుకు, పీఏసీ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు.
పార్టీ నాయకులు ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయ వ్యూహాలు, పార్టీ సిబ్బందిపై చర్చలు జరిపారు.