ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మనపెద్దలు. ఈఫార్ములాను ఒంటబట్టించుకున్నారు మనహీరోయిన్లు. ఇండియన్ బిగ్ స్క్రీన్ పై సత్తా చాటడం కాదు… గ్లోబల్ మార్కెట్ లోనూ మెరిసిపోతున్నారు. అక్కడ కూడా మన జెండా పాతేస్తున్నారు.
ఇండియన్ బ్యూటీలు లెవెల్ పెంచేస్తున్నారు. సౌత్, నార్త్ బార్డర్స్‌ను దాటేసి వరల్డ్ సినిమాను దున్నేస్తున్నారు. అమ్మో హాలీవుడ్డా అనే రోజుల నుంచి.. అవునూ హాలీవుడ్‌లోనూ చేస్తున్నామని చెబుతున్నారు . ఒకరి వెంట మరొకరు వరసగా ఇంటర్నేషనల్ మూవీస్‌లో రచ్చ చేస్తున్నారు. హీరోలకు కూడా దక్కని గోల్డెన్ ఛాన్స్ లను కొట్టేస్తున్నారు గ్లామర్ బ్యూటీలు. అలా అని ఏవో గెస్టు రోల్స్లోనో.. చిన్న చిన్న పాత్రల్లోనో కాదు.. నేరుగా సినిమాలనే లీడ్ చేసే ఛాన్స్‌లను అందుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు.
. హలీవుడ్ లో నటించాలని ఎందరో నటులు కలలు కంటుంటారు. కానీ ఆ అదృష్టం అందరికి దక్కదు. అవకాశం వచ్చినా చాలా మందికి నిలబడదు. కానీ ఇప్పుడు కొందరిని అదృష్టమే వెతుక్కుంటూ వచ్చేస్తోంది. హాలీవుడ్ లో అవకాశాలు ఇస్తోంది.
హాలీవుడ్లో సత్తా చాటుతున్న బ్యూటీల్లో ముందు వరుసలో నిలిచింది ఐశ్వర్య రాయ్. ఆ తర్వాత మల్లికా శెరావత్ తన గ్లామర్ తో రచ్చ చేసింది. ఐష్, మల్లికా తర్వాత ఆ రేంజ్ లో వండర్స్ క్రియేట్ చేస్తోంది. ప్రియాంక చోప్రా. వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తోందీ దేశీగాళ్. ఇక ఐదేళ్ల క్రింత ‘ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్’ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ దీపికా పదుకొనే. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న బ్యూటీ… ఛాన్స్ వస్తే చాలు హాలీవుడ్ లో మెరిసిపోవడంతో పాటు క్రేజీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. వరుస చిత్రాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసింస్తున్న అలియా భట్ హాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ లో మెరిసిపోయిందీ బ్యూటీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతిహాసన్ హాలీవుడ్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగింది. ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో కనిపించిందీ బ్యూటీ.
ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో అలరించిన శోభితా దూళిపాళ్ల హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసింది. ‘మంకీ మ్యాన్’లో మెరిసిపోవడంతో పాటు ఈ బ్యూటీ గ్లామర్ కు ఓ రేంజ్ లో పాలోయింగ్ వచ్చేసింది. చైనీస్ భాషలో వరల్డ్ సూపర్‌స్టార్ జాకీచాన్‌కు జోడీగా కుంగ్ ఫూ. యోగా చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది దిశాపటానీ . చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ హాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వెబ్ సిరీస్ నటుడు టైరీస్ గిబ్సన్‌తో జోడీ కట్టినట్లు టాక్ నడుస్తోంది. చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్లోనే కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్టుతో ఎలాంటి మాయ చేస్తోందోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి సౌత్ నార్త్ బ్యూటీలు గోబల్ రీచ్ ను సంపాదించుకోవడంతో పాటు హాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంటూ దూకుడు చూపిస్తున్నారు.