కాఫీ ని ఇష్టపడని వారెవరు ఉండరు .. ఫిల్టర్ కాఫీ , ఇన్స్టంట్ కాఫీ , ,కోల్డ్ కాఫీ ,, ఇలా చాలా అనేక రకాల కాఫీలు ప్రజల కోసం అందుబాటులో ఉన్నాయి .. కొంత మంది అయితే కాఫీ తోనే తమ రోజును ప్రారంభిస్తారు .. ఏదైనా మితిమీరి త్రాగితే ఆరోగ్యానికి హానికరమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు . ఇక తలనొప్పి ఉన్నవారు , అలానే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నవారు అలవాటుగా కాఫీ ని ఎక్కువ సేవిస్తుంటారు .. ఇక ఓ సర్వే ప్రకారం అయితే కాఫీ కొంత మందికి మంచిది . అలానే చాలా మంది బ్లాక్ కాఫీ ని త్రాగడానికి ఇష్టపడుతుంటారు , మరికొందరు అయితే బులెట్ ప్రూఫ్ కాఫీ పొద్దునే లేవగానే తాగుతారు , ఈ బుల్లెట్ కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి .ఇక తాజా సమాచారం ప్రకారం పాలు, చక్కెర లేకుండా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్న కొందరికి కాఫీ తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవో, ఎవరెవరికి కాఫీ దూరంగా ఉండాలో తెలియాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి .. అవేంటో ఇప్పడు చూద్దాం


యాసిడ్ రిఫ్లక్స్ లేదా GERD సమస్యతో బాధపడుతున్న వారికి కాఫీ పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తారు.

    కాఫీలో ఉన్న కెఫిన్, యాసిడ్స్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి.ఆరోగ్య సమస్యలు: గుండెల్లో మంట, ఛాతీ నొప్పి, రిఫ్లక్స్ లక్షణాలు మరింత తీవ్రం అవుతాయి. ఆందోళన, నిద్రలేమితో బాధపడేవారు కాఫీలోని కెఫిన్ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇది హృదయ స్పందనను పెంచి, ఒత్తిడిని మరింత పెంచుతుంది.

      నిద్రకు ముందు కాఫీ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది.వీటితో బాధపడేవారు కెఫిన్‌ను పూర్తిగా మానేయడం మంచిది. ఐరన్ లోపం ఉన్నవారు కాఫీ శరీరానికి ఐరన్ శోషణను నిరోధిస్తుంది. కాఫీలోని టానిన్‌లు ఐరన్‌తో బంధించి, శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందనివ్వవు.

        ప్రత్యేకించి, ఆహారానికి తక్షణం ముందు లేదా తర్వాత కాఫీ తాగకూడదు ..గర్భిణీ స్త్రీలు కెఫిన్ వినియోగం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

        కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల ముందస్తు ప్రసవం, తక్కువ బరువుతో పుట్టిన శిశువు, గర్భస్రావం ప్రమాదం ఉండొచ్చు. రోజుకు 200 మి.గ్రా కంటే తక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది, ఇది సుమారు ఒక చిన్న కప్పు కాఫీకి సమానం. రక్తపోటు ఉన్నవారు కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తీవ్రతరమవుతుంది.

        కెఫిన్ గుండె, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.అధిక రక్తపోటు ఉన్నవారు కెఫిన్ పరిమితంగా తీసుకోవాలి. కాఫీ మంచి పానీయం అయినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు దానిని దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీకు పై సమస్యలేవైనా ఉంటే, కాఫీ వినియోగం తగ్గించడమో, పూర్తిగా మానేయడమో చేయాలని సూచిస్తున్నారు.