సంక్రాంతి అంటే అభిమానులకు ఆ ఫ్యామిలీ చేసే సందడే గుర్తొస్తుంది. పండగ వేళ వాళ్లు చేసే అల్లరిని మళ్లీ ఏడాది దాకా మర్చిపోరు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి కలర్ ఫుల్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి మ్యాజిక్ కనిపించకపోవడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
సంక్రాంతి సెలబ్రేషన్స్ ను ప్రతి ఒక్కరు కలర్ ఫుల్ గా జరుపుకున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలు చేసిన సందడి నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. అయితే ఎవరు ఎలా జరుపుకున్నా ఇండస్ట్రీకి సంబంధించి అందరి చూపు మాత్రం మెగా ఫ్యామిలీపైనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏటా…. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక చోట చేరి సందడిగా జరుపుకుంటారు. కుటుంబం మొత్తాన్ని చిరంజీవి ఒకే తాటిపైకి తీసుకొచ్చేవారు . అలా ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ చేసే రచ్చని చూసి ఫ్యాన్స్ మురిసిపోతారు. అయితే ఈ సారి మాత్రం ఆ సందడి మిస్ కావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
మెగా ఫ్యామిలీ లో ఈ సారి సంక్రాంతి మ్యాజిక్ ఎందుకు మిస్ అయింది. అసలు ఎవరు ఎక్కడ పండగ జరుపుకున్నారు.
సంక్రాంతి వస్తుందంటే చాలు…. ప్రతిఏటా మెగా ఫ్యామిలీ బెంగళూర్ లోని ఫామ్ హౌస్ లో వాలిపోతారు. మూడు రోజుల పండగను ముచ్చటగా జరుపుకుంటారు. పైగా రెండు రోజుల ముందు ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకుని సందడిగా గడిపేవారు. ఈ వేడుకల్లో మెగా బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అల్లు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. సురేఖ ఆధ్వర్యంలో వంటలు, మిగత టీమ్ ఆటలు, పాటలు చిరు అల్లర్లు ఇలా సందడిగా సాగేది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ ఫోటోలను చూసేందుకు మెగా అభిమానులకు రెండు కళ్లు సరిపోయేవి కావు. అయితే ఈ ఏడాది మాత్రం ఆ సందడి మిస్ అయింది.
మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీలో ప్రధాని మోడీ తో కలిసి సంక్రాంతికి ని జరుపుకోగా… రామ్ చరణ్ ఉపాసన క్లీంకార తో కలిసి జరుపుకున్నారు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సెలబ్రెట్ చేసుకున్నాడు. వరణ్ తేజ్ లావణ్యతో… యంగ్ హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తమ స్నేహితులతో కలిసి పండగను జరుపుకున్నారు. ఇలా ఎవరికివారే ఈ ఏడాది సంక్రాంతి పండుగను కానిచ్చేశారు. అయితే దీనికి కారణం.. హెడ్ ఆఫ్ ద హోం మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లో లేకపోవడమా, లేక ఇరు కుటుంబాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వల్ల కామ్‌గా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా గతేడాది సందడి మిస్ అయిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.