పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓజి .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజి సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు .. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ …….. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ మీద బిజీగా ఉంటూనే తన లైన్ అప్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు .. అలానే పెండింగ్ లో ఉన్న హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు . యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ – రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు .. ఆ తరువాత ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయింది ..

సుజీత్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ..

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఆ స్పెషల్ సాంగ్ ఓ హాట్ బ్యూటీ చేస్తుందని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా నేహా శెట్టి సినిమాలు చేసినా కూడా ఆ అమ్మడికి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సోషల్ సాంగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. నేహా శెట్టి నిజంగా పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందేమో చూడాలి.