ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఈ లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలి. కొత్త కంపెనీలు ఏర్పాటు అయ్యేలా చూడాలి. ఇదివరకే ఉన్న కంపెనీలు విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. పెట్టుబడులకు, వ్యాపారానికి అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని యువ బృందం, ఎకనామిక్ బోర్డ్ కలిసి తీర్చి దిద్దాలి.