ఏపీ రాష్ట్రంలోని 4 విభాగాల్లో వివిధ పంచాయతీలకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. ఈ అవార్డులలో, 4 పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి.
ఆరోగ్య విభాగం: చిత్తూరు జిల్లా బొమ్మ సముద్రం పంచాయతీ ఎంపికయ్యింది.
క్లీన్ అండ్ గ్రీన్ విభాగం: అనకాపల్లి జిల్లా తగరంపూడి పంచాయతీకు అవార్డు.
వాటర్ సఫిషియెంట్ విభాగం: అనకాపల్లి జిల్లా న్యాయంపూడి పంచాయతీ ఎంపిక అయ్యింది.
సోషలిస్టు & సోషల్ సెక్యూరిటీ విభాగం: ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల పంచాయతీ ఈ అవార్డును సాధించింది.
ఈ అవార్డులు పొందిన పంచాయతీలను డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ, ఈ పంచాయతీలు తమ పనితీరు, సమాజ సేవలో చేసిన కృషితో ఆదర్శంగా నిలుస్తున్నాయని, వారి పనిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని పంచాయతీలు అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ప్రోత్సాహించారు.