యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే ఆశ యంగ్ హీరయిన్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ వరకు ఉంటుంది .ఇక తారక్ సరసన అవకాశం వస్తే ఎవ్వరూ అంత సులువుగా వదులుకోరు ..అసలు ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడం నా డ్రీమ్ అంటోంది ఓ స్టార్ హీరోయిన్ ,, ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ …….వాచ్ దిస్ స్టోరీ ..

ఐశ్వర్య రాజేష్ .. యంగ్ టాలెంటెడ్ గ్లామర్ హీరోయిన్ , తాను చేసిన సినిమాలు తక్కువే అయిన మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేసింది .. నా రూటే సెపెరేట్ అంటోంది ఐశ్వర్య ,, ఇంకా చెప్పాలంటే ఎన్ని సినిమాలు చేశాం అనేది ముఖ్యం కాదు అన్నయ్య ,, చేసిన సినిమాల్లో నా పాత్ర పది కాలాల పాటు ప్రేక్షకులకు గుర్తుండి పోతే చాలు అంటోంది ఐశ్వర్య .. తాజగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది .. మరి ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం క్యారెక్టర్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ..

జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు .. గత ఏడాది దేవర సినిమాతో తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .. దేవర పార్ట్ – 1 కి సీక్వెల్ పార్ట్ 2 త్వరలనే షూటింగ్ మొదలు కానుంది ,, ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తున్నాడు , ఈ సినిమా తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్ అప్ లో ఉంది .. తాజగా ఎన్టీఆర్ కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తోంది

ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో సూపర్ హిట్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉంది ఐశ్వర్య రాజేశ్. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది .. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అవ్వడం తో ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి ,,
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేశ్.. కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది .

తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని ,, స్టూడెంట్ నెం. 1 సినిమా నుంచి ఎన్టీఆర్ ని చూస్తున్నానని.. ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఆయనతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని.. తారక్ డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటించే తీరు తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. ఆయనతో వర్క్ చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నానని.. ఆ అవకాశం ఇప్పటివరకు రాలేదని.. భవిష్యత్తులో వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది.

ఫైనల్ గా ఐశ్వర్య రాజేష్ తన మనసులోని మాట చెప్పేసింది .. అలానే ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపింది .. సో చూడాలి ఐశ్వర్య రాజేష్ డ్రీమ్ త్వరలోనే తీరాలి అని కోరుకుందాం ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *