ఇదేం డెడికేషన్ కా … బాబోయ్ అంటున్నారు అందరూ ఆ బ్యూటీ చేసిన పనిని చూసి. ఎంత మహానటి అయితే మాత్రం ఇంత పర్పార్మెన్ చేయాలా అని నోరెళ్లబెడుతున్నారు.
సినిమా కోసం రిస్క్ చేయడమే ఒకే కానీ.. మరీ సినిమా లెవలెలో రిస్క్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మహానటి కీర్తి సురేష్ సినీ ప్రియులు, అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. మొన్నటి వరకు తన చిన్ననాటి ప్రేమాయణాన్ని సైలెంట్‌గా దాచి.. సడెన్‌గా పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కిన బ్యూటీ.. తాజాగా ఎవరూ ఊహించని మరో పని చేసింది. ప్రస్తుతం బీటౌన్ మూవీలతో బిజీగా ఉంది కీర్తి సురేష్. ఈక్రమంలో తాను నటిస్తున్న బేబీ జాన్ సినిమా కోసం చేసిన రిస్క్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
.. సినిమా ప్రమోషన్స్ కోసం ప్రయోగాలు చేసేవాళ్లు ఉంటారు. రిస్కులు చేసేవాళ్లు మరికొందరు ఉంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం అంతకు మించిన పని చేసింది. ఇండస్ట్రీలో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు చాలా తగ్గిపోతాయి. అందుకే చాలా మంది పెళ్లి అయినా సరే.. వాటిని ప్రూవ్ చేసే మంగళసూత్రం, కాలిమెట్టెలు, రింగులు, నూదుట సింధూరం వంటివి ధరించడానికి ఆసక్తి చూపించరు. కానీ కీర్తి సురేష్ ఈ బారియర్స్‌ను బ్రేక్ చేసింది. మిగిలిన హీరోయిన్స్ కు భిన్నంగా వ్యవహరించి షాక్ ఇచ్చింది. తాజాగా తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘బేబీ జాన్’ ప్రమోషన్స్ కి వెళ్లిన బ్యూటీ మెడలో తాళిబొట్టు, చేతులకు, కాళ్లకు పారాణితో కనిపించారు. అలాగే కాళ్లకు మెట్టెలు ధరించారు. దీంతో బాలీవుడ్ జనాలు కాస్త షాక్ అవుతున్నారు.
పెళ్ళై న రెండ్రోజులకే సినిమా ప్రమోషన్లో పాల్గొనడం ఆశ్చర్యం అంటే.. నవ వధువులాగే ప్రమోషన్స్ కు రావడం మరింత షాక్ ఇస్తోంది చాలా మందికి. దీంతో బ్యూటీ డెడికేషన్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మోడ్రన్ డ్రెస్సులో వెళ్లడమే కాకుండా మెడలో తాళిబొట్టుతో వెళ్ళింది. దీంతో కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్ లో మంగళసూత్రంతో కనపడిన వీడియోలను బాలీవుడ్ మీడియా తెగ వైరల్ చేస్తుంది. అంతే కాదు ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలోనే ఉండనుంది. బ్యూటీ ట్రెడిషన్ కు పలువురు ఫిదా అవుతున్నారు. బ్యూటీ ని కొంత మంది అభినందిస్తుంటే, మరికొంతమంది మాత్రం రీసెంట్ గానే కదా పెళ్లి అయింది అందుకే వేసుకుంది అని.. కొంతమంది ఆ మోడ్రన్ డ్రెస్ మీద తాళిబొట్టు అవసరమా అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కీర్తి తన పెళ్లితో కంటే పెళ్లి తర్వాత ప్రమోషన్ కి ఇలా తాళిబొట్టు కనిపించి బాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది.