జీ5 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘హిసాబ్ బరాబర్’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జనవరి 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. విలక్షణ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేశ్, కీర్తి కుల్హారి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా కథలో రాధే మోహన్ శర్మ (ఆర్. మాధవన్) అనే రైల్వే టికెట్ కలెక్టర్ తన బ్యాంక్ ఖాతాలో కనిపించిన చిన్న పొరపాటును ప్రశ్నించడంతో ప్రారంభమవుతుంది. ఆరా తీయడంతో అది ఓ పెద్ద ఆర్థిక కుంభకోణం అని తెలుసుకుంటాడు. తన చుట్టూ జరిగే అవినీతి, మోసాలను ఎదుర్కొని, న్యాయం కోసం చేసిన పోరాటమే కథకు ప్రాణం. బ్యాంక్ హెడ్ మిక్కీ మెహతా (నీల్ నితిన్) లాంటి శక్తివంతులైన వ్యక్తులతో రాధే మోహన్ పోరాటం ఆసక్తికర మలుపులను సంతరించుకుంది.

డ్రామా, కామెడీ, సామాజిక అంశాలు మిళితమై రూపొందిన ఈ చిత్రానికి అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించారు.
జియో స్టూడియోస్, ఎస్పి సినీ కార్ప్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది.
మాధవన్ మాట్లాడుతూ, “ఇది జీ5తో నా మొదటి చిత్రం. సామాన్యుడి పాత్రలో నటించడం నాకు ఒక కొత్త అనుభవం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ చెప్పబడింది, ఇది ప్రేక్షకుల హృదయాలను హత్తుతుందనే నమ్మకం ఉంది.” అని చెప్పుకొచ్చారు.

ట్రైలర్‌లో, రాధే మోహన్ సరళ జీవితం ఒక చిన్న పొరపాటు వల్ల ఎలా తలకిందులవుతుంది, న్యాయం కోసం అతను ఎలాంటి సాహసాలు చేస్తాడు అన్నది చూపించారు. చిత్రంలో ఉన్న డ్రామా, హాస్యం, ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

జనవరి 24న జీ5లో స్ట్రీమింగ్ అవబోయే ఈ చిత్రానికి మీరందరూ సిద్ధంగా ఉండండి