ఆర్ ఆర్ ఆర్ సినిమాలో విలక్షణ నటుడు సత్య దేవ్ నటించాడు .. అవును మీరు వింటున్నది నిజమే ,, ఈ న్యూస్ కొద్దీ సేపటి కిందకే వెలుగులోకి వచ్చింది .. సత్య దేవ్ .. మొదటగా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ , ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టు గా పలు సినిమాల్లో చేసి తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకున్నాడు .. ఫ్రెండ్ క్యారెక్టర్ , విలన్ రోల్ , నెగిటివ్ రోల్ , పాత్ర ఏదైన సరే త్వరగా ఆ పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేసి చాలా అవలీలగా నటించి ప్రేక్షకుల చేత శబాష్ అని అనిపించుకున్నాడు సత్య దేవ్..

రాజమౌళి – రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ..పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . ఈ సినిమాలో కాస్టింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది , ఇక తాజగా ఈ సినిమాలో నటుడు సత్య దేవ్ కూడా నటించాడు , అయితే ఎడిటింగ్ లో జక్కన్న సత్య దేవ్ నటించిన కొన్ని సీన్స్ తీసేసినట్లు తెలిసింది .. ఇందుకు గల కారణము ఏమిటో కూడా తేలియదు , ఇక ఈ విషయం ఇప్పుడు సడెన్ గా వెలుగులోకి వచ్చింది .. ఇక ఈ విషయాన్ని చెప్పాలా, వద్దా అని మొహమాటపడుతూనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సత్య దేవ్ చెప్పేశాడు. ‘ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు 10 రోజులు వర్క్ చేశా. చివరకు నాకు సంబంధించి దాదాపు 16 నిమిషాల సీన్లని ఎడిటింగ్‌లో తీసేశారు. టీమ్‌పై ఉన్న గౌరవంతో ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఆ పది రోజులు వర్క్ చేయడంను మర్చిపోలేని అనుభూతి’ అని సత్యదేవ్ తెలిపాడు. ఫైనల్ గా ఏ నటుడికి అయినా రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే చాలా ఆనందపడతారు , కానీ ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలో నటుడు సత్య దేవ్ నటించాకా కూడా ఆ సీన్స్ సినిమాలో లేవు అని బాధపడలేదు చాలా లైట్ తీసుకున్నాడు ..