ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన: బెంగాల్ ప్రభుత్వం సంజయ్ రాయ్‌కి మరణశిక్ష కోసం హైకోర్టును ఆశ్రయించింది

ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనకు సంబంధించి నిందితుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో, మమత బెనర్జీ ప్రభుత్వం హైకోర్టు వద్ద మరణశిక్ష కొరకు వాదనలు ప్రవేశపెట్టింది.

సంజయ్ రాయ్‌కి విధించిన జీవితఖైదును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడం, ఈ కేసుకు మరింత జటిలత కలిగించింది. అయితే, ఈ వ్యవహారంలో ఆర్జీ కర్ మృతురాలి తండ్రి తమ స్పందనలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి తప్పుబట్టారు.

మమత బెనర్జీ చేసిన తొందరపాటు చర్యలను తప్పుబట్టి, ఈ వ్యవహారంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. “రేపు తీర్పు కాపీ వస్తుందని, దానిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

ఈ కేసు సంబంధిత సాక్ష్యాలను తారుమారు చేసిన వారిలో పోలీసులు, పోలీస్ కమిషనర్ ఇతరులు ఉన్నట్లు మృతురాలి తండ్రి ఆరోపించారు. “ఇవి మమతా బెనర్జీ గమనించలేదా?” అని ప్రశ్నించారు.

అలాగే, సీబీఐ సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితుడికి జీవిత ఖైదు పడినట్లుగా వారు అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు