News: తెలంగాణ రాజకీయాల్లో మరో విమర్శల దాడి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి, అమృత్ పథకంలో జరిగిన టెండర్లలో అక్రమాలు జరిగాయని, సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారనే కేటీఆర్ ఆరోపణలను ఖండించారు.
మల్లు రవి ప్రకటనలో, సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికావని, అతను రేవంత్ రెడ్డి మామగారి తమ్ముడి కొడుకని పేర్కొన్నారు. కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ పథకం కింద జరిగిన టెండర్లు పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో జరిగినట్లు వివరించారు. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, రేవంత్ రెడ్డి పది నెలల పాలనలో ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూస్తూ ఈ విధమైన రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మల్లు రవి పేర్కొన్నారు.
అమృత్ పథకంలో జరిగిన టెండర్లకు సంబంధించి అక్రమాలు జరిగాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాసినట్లు కేటీఆర్ చెప్తున్నారని, విచారణ జరిగితే నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.